Monday, December 1, 2014

Chuda chakkani na talli chukkalo jabilli song lyrics



Lyricist: అందె శ్రీ
Singer: Ramana
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య
సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి
మళ్ళీ జనమంటూ ఉంటె సూరమ్మో..ఓ.ఓ.ఓ
తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా
తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా

సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి

తొలికోడి కూయంగా తెలతెల్లవారంగా
పాలూ కడవల్ల నిండా పల్లే బంగారూ కొండా
పారూతున్నా ఏరు పచ్చాపచ్చాని పైరు
ముత్యాలాముగ్గుల్లో సిగ్గూలొలికే పల్లె
సంక్రాంతి సంబారాలు సూరమ్మో..ఓ.ఓ.ఓ
అంబారాన్నీతాకే సూడమ్మో
 అంబారాన్నీతాకే సూడమ్మో

సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి

పుండ్లున్నాసుండ్రున్నా చీదారించాకుండా 
ఊడీగామెంతో చేసే మా అన్న మంగాళన్న
పల్లెన్తా మైలాదీసి మల్లేపువ్వూగా జేసి 
ఓహోం ఓహోం అంటూ పల్లాకి మోతైనావు
మాడేరును మదిలోదలసి ఓరన్నో..ఓ.ఓ.ఓ
ఊరీకీ దివిటైనావా మా యన్నా..
నువ్వు ఊరీకీ దివిటైనావా మా యన్నా

సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి

జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి హోయ్
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి హోయ్

మట్టినీ ముద్దాజేసి మా కూటికి కుండైనావ  
గౌడన్నా తాళ్ళుగీసి పల్లెంత కల్లుబోసి
పొద్దంతా బట్టానేయ డుండె దారాపుకండే 
ఆరూగజాలా చీర అగ్గీపెట్టెల్లో బెట్టె
చేతీ కులవృత్తులాకు ఓరన్నో..ఓ.ఓ.ఓ
చెయ్యెత్తి దండంబెడతా సాలన్నా
 చెయ్యెత్తి దండంబెడతా సాలన్నా

సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి

అల్లల్లానేరేళ్ళ గోల్లాపురుమాల మంద 
ఊరూమేలు కోరే వీరన్నా దండాలన్నా
కొత్తాగాలీ దిప్పి పొద్దంతా ఒత్తిఒత్తి 
కొడవల్లకు కతైనావు నాగల్ల కర్రైనావు
కమ్మారి కొలిమైనవా ఓరన్నో..ఓ.ఓ.ఓ
మాఊరికి చెలిమైనావ మాయన్నా
మాఊరికి చెలిమైనావ మాయన్నా

సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి

కాళ్ళకీ చెప్పైనావు దండోరా డప్పైనావు 
పల్లేకుచివరాన ఉంటూ ఊరికే కాపైనావు
ఎండావానల్లో నీవే సేనుసెలకల్లో నీవే 
అయ్యారే మాలన్నా అన్నీ పనులల్లో నీవే
సరిరారు నీకెవరు ఓరన్నో..ఓ.ఓ.ఓ
సల్లంగా ఉండాలి మాయన్నా
నువ్వు సల్లంగా ఉండాలి మాయన్నా

సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి


14 comments:

  1. Replies
    1. అందానికి అందం ఈ అద్భుత గేయ కుసుమం, దండాలు నీకు ఓ జయరాజన్నా...

      Delete
  2. Entho goppa song pallenu kallamundhuku thechindhi

    ReplyDelete
  3. క్షమించాలి అందెశ్రీ గారి అద్భుత రచన ఇది జయరాజ్ గారిది కాదు, సరి చేసుకుంటున్నా...

    ReplyDelete
  4. "Very very extadnary mind bloing" supar supar song

    ReplyDelete
  5. Excellent song andesree 👏🙏

    ReplyDelete