పుడమి ఎదలపైన
పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మా
ఈ మట్టిబిడ్డలా
ఇలవేలుపైన మా ఇంటింటి దేవతమ్మా
గలగలా గాజులా పడతులా
చేతులా దోసిట్లో ఒదిగి పోతావు
పూవ్వుతో నీ పూవు
అల్లుకొని ఈ ధరణి వాకిట్లో కొలువుదీరేవు
బతుకమ్మ తల్లిగా
సేవలందేవు ||2 ||
బతుకమ్మా నీ రూపం మా బతుకుల్లో
దీపం
తెలంగాణా మట్టీబిడ్డల
ఇలవేలుపువమ్మ మాయమ్మా బతుకమ్మా
మా బతుకే నీవమ్మా
ఉయ్యాలో ఉయ్యాలో
బతుకమ్మా ఉయ్యాలో ||2||
ఊహలకే రూపంపోసిన రూపం
నీది బతుకమ్మా.. ఉయ్యాలో ఉయ్యాల
మాతోడై నిలిచినా
మహాశక్తివీ నీవమ్మా.. ఉయ్యాలో ఉయ్యాల
దద్దరిల్లినా యుద్ధభూమిలో
పొద్దుపొడుపువైనావో ఉద్యమానికే ఊతమిచ్చి మా పెద్దదిక్కువైనావో
తెలంగాణా జాతి ఖ్యాతిని
ప్రపంచాన పరిచయమే చేసిన ఘనత నీది గౌరమ్మా
ఘనమైన తల్లి బతుకమ్మా
ఉయ్యాలో ఉయ్యాలో
బతుకమ్మా ఉయ్యాలో
సద్దులా బతుకమ్మా
ఉయ్యాలో ఉయ్యాలో రామా ఉయ్యాలో
మా ముద్దుల బతుకమ్మా
ఉయ్యాలో ఉయ్యాలో రామా ఉయ్యాలో
సద్దులా బతుకమ్మా
ఉయ్యాలో ఉయ్యాలో రామా ఉయ్యాలో
మా ముద్దుల బతుకమ్మా
ఉయ్యాలో ఉయ్యాలో రామా ఉయ్యాలో
తీరొక్క పువ్వుల్లో
మెరిసేటి అందం ఉయ్యాలో రామా ఉయ్యాలో
తెలంగాణా దారుల్లో
అల్లిన బంధం ఉయ్యాలో రామా ఉయ్యాలో
ఉయ్యాలో రామా ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
బతుకమ్మా ఉయ్యాలో
గంగమ్మని ముద్దాడ
బయల్లెల్లె ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో గౌరమ్మా
ఉయ్యాలో
తల్లీ మల్లేడు రావే
తల్లీ ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
బతుకమ్మా ఉయ్యాలో
గంగమ్మని ముద్దాడ
బయల్లెల్లె ఉయ్యాలో
No comments:
Post a Comment