Writer : Mittapalli Surender
Music : Bobili Suresh
ప్రకృతి మాత ప్రతి గడపకు గౌరమ్మై వచ్చునంట రామ నా ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో
పడతుల చేతుల్లో తాను పసిపాపై పెరుగునంట రామ నా ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో
గౌరమ్మే బతుకమ్మై గంగమ్మలో లీనమౌను రామ నా ఉయ్యాలో సిరి దేవనా ఉయ్యాలో
ధీంత ధీంతనన ధీంత ధీంతనన దినననా దినన దిన
ధీంత ధీంతనన దినననన దినననన దినా
బతుకమ్మా బతుకమ్మా మా పండుగ నీవేనమ్మా
బతుకమ్మా బతుకమ్మా మా సంతోషం నీవమ్మా
కొమ్మాకొమ్మల్లో నీవు పుడతావే పువ్వై
గుమ్మాలన్నిట సీకటి సేరిపే పువ్వులమ్మై
తంగెడుపూలతో నిన్నే పేర్చి మా గడపలలో
నిలిపామమ్మా
మా తోడునీడా నీవై అన్నీ నడపాలీ అమ్మా
గునుగూపూలతో నిన్నే పెంచి మా గుడిసెలే గుడి
చేసామమ్మా
ఏట నవరాత్రులు నిన్ను కొలిచేమమ్మా
మా లోగిలి మురిసే నువ్వు మా ఇళ్ళల్లో ఉంటే
మా కన్నులు ఎగిసే మా కళ్ళ ముందే ఉంటే
మా ముంగిట ఉంటే మా కన్నులు మురిసేనంటా
మా ఆడబిడ్డా మా కన్నతల్లివంట
మా లోగిల్లల్లో నీవే బతుకమ్మా
మా కన్నబిడ్డ నీవే లే
మా గుండేల్లోనా నీవే బతుకమ్మా
మా ఆశలుదీర్చే ఓ చల్లని దేవతవే
పడుచుల జడలో దేవుడిగుడిలో మాల గా మారి వాడే పూలూ
నీ వడిలో చేరి పొందేనే పూజలూ
దారుల పొడవున బారులు తీరిన మనిషి పాదాల కింద
నలిగే విరులు
నీ సిగలో నిలిచి ఊరేగే రోజులు
బతుకమ్మా బతుకమ్మా మా గుండెలో ఉన్నావమ్మా
బతుకమ్మా బతుకమ్మా మా పండుగ నీవేనమ్మా
కురిసిన చినుకులు దోసిట నిలిపెను
ఊరికి చివరన మా చెరువు
నువ్వు తానాలాడిపించాలమ్మా మా కరువు
పాడీపంటను కాపాడమని కొలిచే సంస్కృతి గౌరమ్మా
తెలంగాణా అంతరాత్మవే బ్రతుకమ్మా
No comments:
Post a Comment