Friday, December 19, 2014

“Cheri Yasoda” Lyrics



Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi

చేరి యశోదకు శిశువితడు ||2||
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు ||చేరి యశోదకు||

సొలసి చూచినను సూర్యచంద్రులను ||2||
లలివేద జల్లెడు లక్షణుడు ||సొలసి||
నిలిచిన నిలువున నిఖిల దేవతల ||3||
కలిగించు సురల గని వో యితడు ||చేరి యశోదకు||

ముంగిట పొలసిన మొహనమాత్మల ||2||
పొంగించే ఘన పురుషుడు ||ముంగిట||
సంగతి మావంటి శరణాగతులకు ||2||
అంగము శ్రీవెంకటాధిపుడితడు ||చేరి యశోదకు||

No comments:

Post a Comment