పొడల పొడల గట్ల నడుమ సందమామ
గోలుకొండ గొల్ల రాజా ఓ రాచ
గుమ్మడి, సల్లలమ్మే పల్లెలయ్యే ఓ రాచ గుమ్మడి ||2||
పొడల పొడల గట్ల నడుమ ఓ
రాచ గుమ్మడి, పొడిసే నొక్క సందమామ ఓ రాచ
గుమ్మడి ||2||
ఆకూ చిన్నా అడవిలోన ఓ రాచ
గుమ్మడి, నాకూ సిన్న దండా దొరికే ఓ రాచ గుమ్మడి ||2||
దండా పేరే పూలా దండా ఓ రాచ
గుమ్మడి, దానీ పేరే గోలుకొండ ఓ రాచ గుమ్మడి ||2||
సల్లాలమ్మే పల్లెలయ్యి ఓ
రాచ గుమ్మడి, పడుచూవన్నె పాటలయ్యే ఓ రాచ గుమ్మడి ||2||
పడుచూవన్నె పాటలయ్యి ఓ రాచ
గుమ్మడి, బతుకమ్మ ఆటాలయ్యే ఓ రాచ గుమ్మడి ||2||
బతుకమ్మబతుకమ్మా
ఉయ్యాలో, బంగారి గౌరమ్మ ఉయ్యాలో ||2||
యాడాదికో సారి ఉయ్యాలో, మాయింటికొస్తావా ఉయ్యాలో ||2||
పెత్తురామాస నాడు ఉయ్యాలో, మావాడ కొస్తావా ఉయ్యాలో ||2||
వచ్చినట్టేవచ్చి ఉయ్యాలో, మురిపించి పోతావా ఉయ్యాలో ||2||
మాఇండ్ల గడపల్లో ఉయ్యాలో బంతీ తోరణాలు ఉయ్యాలో ||2||
మావాడ వాకిళ్లో ఉయ్యాలో, రంగూరంగుల ముగ్గులుయ్యాలో ||2||
మా అన్నదమ్ములు ఉయ్యాలో, తీరొక్కపూదెచ్చిరి ఉయ్యాలో ||2||
గురుగుపూలూబేర్చి ఉయ్యాలో, గౌరీ నిను మొక్కితి ఉయ్యాలో ||2||
మల్లేపూలూపేర్చి ఉయ్యాలో, అమ్మానిను కొలిస్తి ఉయ్యాలో ||2||
తంగేడుపూపేర్చి ఉయ్యాలో, తల్లీ నిను పూజిస్తితి ఉయ్యాలో ||2||
మా అమ్మాలక్కలు ఉయ్యాలో, సద్దులు వండిరి ఉయ్యాలో
పట్టుచీరెల
పడుచూలుయ్యాలో, ఇంటాడబిడ్డలూ ఉయ్యాలో
నాలుగుబాట్ల కాడ ఉయ్యాలో, శెరువుగాట్ల కాడ ఉయ్యాలో
బతుకూపాటనుజేసి ఉయ్యాలో బతుకమ్మాలాడిరి ఉయ్యాలో ||2||
బతుకమ్మా నీయింట
ఆటసిలకలు రెండు పాటాసిలకలు రెండు
కలికీసిలకలు రెండు
కందమ్మబిడ్డలూ ముత్యపుగొడుగులు
ముమ్మాసిరి మేడలు
తారుద్దరాక్షలు తీరూగోరింటాలు
ఘనమైన పొన్నాపూవే
గౌరమ్మ, గజ్జలవడ్డాణము గౌరమ్మ ||2||
సిన్నశ్రీవత్తులు
గౌరమ్మ, సన్నదీపాలూ గౌరమ్మ ||2||
నీనోము నీకిస్తూమూ
గౌరమ్మ, మానోము ఫలమియ్యమ్మా గౌరమ్మ ||2||
పొడల పొడల గట్ల నడుమ ఓ
రాచ గుమ్మడి, పొడిసే నొక్క సందమామ ఓ రాచ
గుమ్మడి ||2||
ఆకూ చిన్నా అడవిలోన ఓ రాచ
గుమ్మడి, నాకూ సిన్నా దండా దొరికే ఓ రాచ గుమ్మడి ||2||
దండా పేరే పూలా దండా ఓ రాచ
గుమ్మడి, దానీ పేరే గోలుకొండ ఓ రాచ గుమ్మడి ||2||
దానీ పేరే గోలుకొండ ఓ రాచ
గుమ్మడి ||2||
No comments:
Post a Comment