శేషశైల వాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్యా శ్రీ చిద్విలాసా ||2||
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ, అలమేలుమంగకూ అలుక రానీయకూ ||2||
ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా జేర్చి ||2||
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి ||2|| ||శేషశైల వాస||
పట్టు పానుపు పైన పవ్వలించర స్వామి ||2||
భక్తులందరూ నిన్ను ప్రస్తుతించీ పాడ
చిరునగవులోలుకుచూ నిదురించు నీ మోము ||2||
కరువు తీరా గాంచి తరియింతుమూ మేము ||శేషశైల వాస||
భక్తులందరూ నిన్ను ప్రస్తుతించీ పాడ
చిరునగవులోలుకుచూ నిదురించు నీ మోము ||2||
కరువు తీరా గాంచి తరియింతుమూ మేము ||శేషశైల వాస||
No comments:
Post a Comment