Friday, December 19, 2014

“Brahma Kadigina Paadam” Lyrics



Lyricist: Taallapaka Annamacharya
Singer: M.S. Subbulakshmi
Raga: Mukhari
Tala: Adi 
బ్రహ్మ కడిగిన పాదము ||3|| 
బ్రహ్మము తానెని పాదము ||బ్రహ్మ కడిగిన||

చెలగి వసుధ కొలిచిన నీ పాదము ||2|| 
బలి తల మోపిన పాదము ||చెలగి|| 
తల ఖగ గగనము తన్నిన పాదము  ||2|| 
బలరిపు గాచిన పాదము ||2||  ||బ్రహ్మ కడిగిన||

కామిని పాపము కడిగిన పాదము ||2|| 
పాము తలనిడిన పాదము ||కామిని|| 
ప్రేమపు  శ్రీ సతి పిసికెడి పాదము ||2||
పామిడి తురగపు పాదము ||2||  ||బ్రహ్మ కడిగిన||

పరమ యోగులకు పరిపరి విధముల ||2||
పరమొసగెడి నీ పాదము ||పరమ||
తిరువేంకటగిరి తిరమని చూపిన  ||2||
పరమ పాదము నీ పాదము ||2|| ||బ్రహ్మ కడిగిన||

No comments:

Post a Comment